పెద్ద స్టార్ అయితే ఏంటి? …కోర్టుకు రావాల్సిందే

218
Nampally Court Shock to Mahesh Babu
- Advertisement -

ప్రిన్స్ మహేష్‌ బాబుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ‘శ్రీమంతుడు’ చిత్రంపై నెలకొన్న వివాదంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని మహేశ్ బాబు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు సైతం సమన్లు జారీ చేసింది.

స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని… తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్‌ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120 బీ, కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్‌ 63 కింద కేసు నమోదైంది.

దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు మహేశ్‌బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్‌బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా శ్రీమంతుడు నిర్మాత నవీన్ కు సమన్లను జారీ చేసిన నాంపల్లి కోర్టు.. విచారణకు  మహేశ్ కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

- Advertisement -