సురేఖపై కేటీఆర్ పిటిష‌న్‌.. విచార‌ణ 18కి వాయిదా

3
- Advertisement -

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణను వాయిదా వేసింది నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు. ఈ నెల 18కి విచారణను వాయిదా వేయగా కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్ల‌ను కోర్టు రికార్డు చేయ‌నుంది.

ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని …బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 356 కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారని… ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మంత్రిపై పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు.

సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను, సోషల్‌ మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తంచేసి కోర్టుకు సమర్పించారు. పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌లను, ఫోటోలను పిటిషన్‌కు జోడించి దాఖలు చేశారు.

Also Read:జమ్మూలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

- Advertisement -