సినీ నటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్ మందిరంలో వైభవంగా జరిగింది. తమిళ దర్శక, నిర్మాత అయిన వీరేంద్ర చౌదరి.. హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. నవంబర్ 24వ తేదీ శుక్రవారం ఉదయం 5గంటల 30 నిమిషాలకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ హాజరుకాకపోయినా.. తమిళనాట నుంచి రాధిక, శరత్ కుమార్ దంపతులు హాజరయ్యారు. చెన్నైలో రిసెప్షన్ జరగనుంది.
రెండేళ్లుగా తాను వీరేంద్రతో ప్రేమలో ఉన్నానని నవంబర్‌లో పెళ్లిచేసుకోబోతున్నానని నమిత గత నెలలోనే వీడియో మెసేజ్ ద్వారా ప్రకటించారు. 1998లో మిస్ సూరత్ గా ఎన్నికైన నమిత …2002లో ‘సొంతం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక రాజు ఒక రాణి’, ‘జెమిని’, ‘బిల్లా’ తదితర చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌లోనూ ఆమెకు గుర్తింపు ఉంది.
సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ షోలోనూ నమిత పాల్గొంది. మియా చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు.నమిత నటన, గ్లామర్ కు ఫిదా అయిన తమిళ అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టించిన సంగతి తెలిసిందే.