టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. ఒమన్ – నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగియగా సూపర్ ఓవర్‌లో నమీబియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. కైల్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది.
జేన్ ఫ్రైలింక్ 48 బంతుల్లో 45 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులు చేయాల్సి ఉండగా మెహ్రన్ రెండు వికెట్లు తీసి నాలుగు పరుగులు ఇచ్చాడు.
ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా ఒమన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయం నమీబియాను వరించింది.
Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!