నమస్తే మోదీ..ఇజ్రాయెల్ గ్రాండ్‌ వెల్‌కమ్!

6
- Advertisement -

ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా అక్కడి ప్రముఖ పత్రిక The Jerusalem Post ప్రత్యేక సంచికను విడుదల చేసింది. పత్రిక తొలి పేజీపై “నమస్తే, మోదీ” అంటూ హెబ్రూ భాషతో పాటు ప్రత్యేక శీర్షికను ముద్రించి స్వాగతం పలికింది. ప్రధాని చేతిని ఊపుతూ ఉన్న పెద్ద ఫోటోను కూడా ప్రచురించింది. Welcome Modi , “New Delhi’s burgeoning partnership with Jerusalem వంటి శీర్షికలతో భారత్–ఇజ్రాయెల్ సంబంధాలపై విశేష కథనాలు ప్రచురించాయి.

ప్రధాని మోదీ బుధవారం ఉదయం ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరారు. ఇది 2017 తర్వాత ఆయన రెండో పర్యటన. ఈ పర్యటనను చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ మోదీని ప్రియ మిత్రుడు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడే తొలి భారత ప్రధాని ఆయనే కావడం విశేషం.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని సమీక్షించనున్నారు. విజ్ఞాన సాంకేతికం, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాణిజ్యం, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

- Advertisement -