జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈరోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు అని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకురాలేదు చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ అతి పెద్ద విగ్రహం పెట్టించి, ఆయన చరిత్ర మొత్తం అక్కడ లిఖించి ప్రజలకు తెలిసేలా చేసింది అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకుకోవడం లేదు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఆయన విగ్రహం పెడతామని మాయ మాటలు చెప్తున్నారు అన్నారు.
ఇక్కడ స్థిరపడ్డ పక్క రాష్ట్రాల వారిని అక్కున చేర్చుకున్నాడు… రామోజీ రావును పక్కా రాష్ట్రం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే, నా రాష్ట్రం నుండి ఎవరిని అరెస్టు చేయడానికి వీలు లేదని, రామోజీ రావు మీద చెయ్యి కూడా పడకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు అన్నారు.
Also Read:భారత మహిళ జట్టుకు ప్రధాని ప్రశంసలు

