- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను నల్లగొండలో సీపీఐ ఆధ్వర్యంలో దగ్దం చేశారు. అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పర్చడం సరికాదని సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నేత నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల బిజెపి ద్వంద నీతో వ్యవహరిస్తూ ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని చెబుతూనే అనేక సందర్భంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. పార్లమెంటులో తెలంగాణ విభజన పట్ల అవమానకరంగా మాట్లాడిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- Advertisement -