BRS:నల్గొండ బీఆర్ఎస్ నేతల అరెస్ట్

4
- Advertisement -

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలను అరెస్ట్ చేశారు పోలీసులు. కంచర్ల భూపాల్ రెడ్డిని తన నివాసం దగ్గరే అరెస్ట్ చేయగా చిరుమర్తి లింగయ్యను చిట్యాల శివారులో అరెస్ట్ చేశారు. ఇవాళ రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు ప్రజలు.

ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటారని ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలను, పలువురు ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదు అన్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం అన్నారు. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాసంఘాల నేతలను అక్రమంగా నిర్బందించారు. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు అని దుయ్యబట్టారు.

Also Read:KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటిస్

- Advertisement -