రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నకిరేకల్‌లో స్థానిక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. సీఎం కెసిఆర్ తెలంగాణలో హరిత హరం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళ లాడుతున్నాయని.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆమె తెలిపారు.
దీనికి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ కూడా తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రముఖులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అని తేడాలేకుండా అందరూ అద్భుతంగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తన్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.