గాడ్‌ఫాదర్‌ మరో ట్రీట్

76
chiru
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అందాల భామ నయనతార, విలక్షణ నటుడు సత్యదేవ్, పూరీ జగన్నాధ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా దసరా కానుకగా అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా మరో సాంగ్‌ని రిలీజ్ చేశారు. నజభజ అంటూ సాగే ఓ పవర్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాట వింటే, అభిమానులకు గూస్‌బంప్స్ ఖాయం. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే పాటగా ఇది వచ్చింది. ఇక ఈ పాట ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో గాడ్‌ఫాదర్ మూవీగా రీమేక్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

- Advertisement -