గ్రీన్‌ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం: నైనా జైస్వాల్

439
naina
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో మొక్కలను నాటిన.. మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మన పర్యావరణం పచ్చదనానికి చిహ్నము మరియు ఐశ్వర్యానికి సంకేతము. ఇటువంటి మంచి పర్యావరణంపై అవగాహన తెలుపుతున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇంకా నేను చెప్పేదేమిటంటే.. సూర్యుని రంగు ఎర్రదనం, చీకటి రంగు నల్లదనం, ప్రకృతి రంగు పచ్చదనం, కానీ మన సంతోష్ రంగు మంచితనమని చెప్పగలను అన్నారు.

ఎందుకంటే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఓ వినూత్నమైన విధానాన్ని కళ్లకు అద్దేటట్టు మరియు అందరికీ తెలిసేటట్టు తెలియపరిచిన సంతోష్ రావు గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఓటమిలో పాఠముంటుంది. గుణములో జ్ఞానముంటుంది. మంచిలో చెడు ఉంటుంది. మనసులో మారే శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనము పర్యావరణ కల్యాణం కొరకు వాడుకోవాలి. అప్పుడే మానవ జన్మం పూలచందనంగా మారుతుందన్నారు.

naina nehwal

క్లైమేట్ ప్లస్ ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ కి నిలువెత్తు నిదర్శనముగా మారి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టుతుంది. ఇంకా మన ప్రకృతి ఒడి సముద్రమంత లోతు ఉంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఆకాశమంత హృదయం ఉండాలి. అప్పుడే మనము ఈ నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టినవారమవుతాము. ఇంకా ప్రపంచానికే మార్గదర్శకులమవుతాము. ఈరోజు డీసీపీ రమేశ్ నన్ను నామినేట్ చేశారు… ఫర్ దిస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. నేను దాన్ని ఆక్సెప్ట్ చేసి ఈ రోజు ఎల్బీ స్టేడియంలో ప్లాంట్ పెట్టాను. సో ఫర్ దర్ గా నేను ఆక్టర్ సుమన్ తల్వార్ గారికి, ఆక్టర్ సుబ్బరాజు గారికి, అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ట్రాన్స్ పోర్ట్ సునిల్ శర్మ గారికి నేను ఫర్ దర్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో రెస్పెక్టెడ్ కిరణ్ బేడి గారిని కూడా నేను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి ఛాలెంజ్ చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Table Tennis player naina nehwal accepts green challenge. Table Tennis player naina nehwal accepts green challenge.

- Advertisement -