విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం..!

142
bjp govt
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 71వ రోజుకు చేరింది. రైతుల ఆందోళనలను అణచివేసేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటుచేశారు.

దీంతో కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించింది.అయితే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పోలీసుల పహారా కొనసాగుతోంది.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేయగా ఫిబ్రవరి 7న రహదారుల దిగ్బందానికి పిలుపునిచ్చారు. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రైతులతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.

- Advertisement -