టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..

45
- Advertisement -

బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ – ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాగపూర్ వేదికగా ప్రారంభైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్.నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక ఎంత తొందరగా బాల్ టర్న్‌ కావడం మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియాలో నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్ర అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ముగ్గురు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అశ్విన్, జడేజా  తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత జట్టు:

రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్,చటశ్వేర పుజారా,విరాట్ కోహ్లి,సూర్యకుమార్ యాదవ్,శ్రీకర్ భరత్,రవీంద్ర జడేజా,అశ్విన్,అక్షర్ పటేల్,మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు:

డేవిడ్ వార్నర్,ఉస్మాన్ ఖాజా,లబుషింగే,స్మిత్,మాట్ రెన్‌షా,పీటర్ హండ్స్‌కాంబ్,అలెక్స్ కారీ,కమిన్స్,నాథన్ లయన్,మర్ఫీ,స్కాట్ బొలాండ్

- Advertisement -