వినూత్నంగా కల్కి 2898ఏడీ ప్రమోషన్స్!

14
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు దర్శకుడు నాగ్ అశ్విన్. రీసెంట్ గానే అమితాబ్ పై ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేయగా దీనికి ఐపీఎల్ టైం లో ఇండియా వైడ్ గా సాలిడ్ రీచ్ వచ్చింది.

తాజాగా కల్కి కోసం దేశం అంతా మాట్లాడ్డం స్టార్ట్ చేసింది. దీనితో మేకర్స్ చేసిన ఈ ప్లాన్ మాత్రం ఒక స్యూర్ షాట్ హిట్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇదే విధంగా కానీ రిలీజ్ వరకు ప్రమోషన్స్ కొనసాగితే కల్కిపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:వెరికోవైన్స్ ను తగ్గించే ‘వజ్రాసనం’!

- Advertisement -