నాగ శౌర్య కొత్త మూవీ స్టార్ట్…

308
nagashowrya new movie start
- Advertisement -

యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు.

కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి , రచయిత కోన వెంకట్ లు చిత్రం స్క్రిప్ట్ ను చిత్ర దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్,ఉపేంద్ర లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

Actor Naga  Shourya Has Started New Film stills4

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నం గా నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను నిర్మిస్తోంది. ‘మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య ‘ఛలో ‘ చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు.

నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కదా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించు కుని ఉంటుందని తెలిపారాయన. చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు.

- Advertisement -