నాగర్ కర్నూల్ పార్లమెంట్ కహాని..

297
nagarkurnool
- Advertisement -

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్ధానం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాంతం. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. పూర్వం నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలను నాగన్న మరియు కందన్న అనే ఇద్దరు సోదర రాజులు పాలించేవారు. ఈ ప్రాంతంలోని రైతులు బండ్లకు వాడే కందెనను రాజు పేరుమీదగా విపరీతంగా అమ్మేవారు. అదే విధంగా కందెనను అమ్మే పట్టణం కందనూల్ అనే పేరు వచ్చింది. అదే పేరు కాలక్రమేన చిన్నకర్నూల్ గా మారింది. అదేవిధంగా నాగన్న పేరు మిద కూడా ఒక గ్రామాన్ని ఏర్పరచారు. దినికి నాగనూల్ అనే పేరుంది. ఇప్పటికే ఇవే పేర్లతో అక్కడ గ్రామాలు ఉన్నాయి. భారతదేశం లోనే రెండవ పెద్ద అడవి నల్లమల అడవి ఈ ప్రాంతం లోనే ఉంది. ఇక హైదరాబాద్ నంచి శ్రీశైలం వెళ్లాలిఅంటే నాగర్ కర్నూల్ నుంచే వెళ్లాలి. నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లాలంటే కేవలం రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాలి. ఈజిల్లాకు రైలు మార్గం లేదు. ఈపార్లమెంట్ పరిధిలో ఎక్కువగా వరి, పత్తి, పంటలను సాగుచేస్తారు. అంతేకాకుండా పాలెం దుంధుభి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఈజిల్లాలోనే ఉంది.

అలాగే 1989లో ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలను స్దాపించారు. ఈజిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ , అలాగే ప్రముఖ నదులైన కృష్ణానది, దిండి నది ఈజిల్లా గుండానే ప్రవహిస్తాయి. ప్రముఖ దేవాలయాలైన సలేశ్వరం, ఉరుకొండ ఆంజనేయస్వామి, సోమేశ్వరరాలయం, మదన గోపాలయం పలు ప్రిసిద్ది చెందిన ఆలయాలు ఈజిల్లాలో ఉన్నాయి. కాకతీయుల రాజు అయినటువంటి గోన గన్నారెడ్డి కూడా ఈప్రాంతంలోనే జన్మించారు. తెలంగాణలోనే ప్రముఖమైన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్ ప్రాంతాలు కూడా ఈజిల్లా పరిధిలోనే ఉన్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్ధానం ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్ డ్ గా కొనసాగుంది. ఈపార్లమెంట్ పరిధిలో మొత్తం11లక్షల 11వేల 800మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్ స్ధానం పరిధిలో మొత్తం 7అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోకి రానున్నాయి. మూడవ లోక్ సభ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గా ఏర్పడింది. 1962వ సంవత్సరం మొదటి ఎన్నికల్లో గద్వాల్ పార్లమెంట్ స్ధానం ఉండగా అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జె. రామేశ్వర్ రావు విజయం సాధించారు.

ఆ తర్వాత 1967లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్ధానం నుంచి ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జే.బి. ముత్యాల రావు గెలుపొందారు. ముత్యాల రావు 1967 నుంచి 1971వరకూ నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 1971, 1977లో జరిగిన ఎన్నికల్లో ఎం. భీష్మ దేవ్ గెలుపొందారు. భీష్మ దేవ్ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలవగా, మరోసారి తెలంగాణ ప్రజాసమితి పార్టీ నుంచి గెలుపొందారు. 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అనంతరాములు మల్లు గెలుపొందారు. అనంతరాములు మల్లు 1980నుంచి 1984వరకు నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వి. తులసిరామ్ గెలుపొందారు. తులసిరామ్ 1984 నుంచి 1989వరకూ ఎంపీగా ఉన్నారు.

ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అనంతరాములు మరోసారి విజయం సాధించారు. అనంతరాములు మొత్తం 10ఏళ్లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మల్లు రవి విజయం సాధించారు. 1991నుంచి 1996 వరకూ మల్లు రవి నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి మంద జగన్నాథం గెలుపొందారు. ఆ తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మల్లు రవి మరోసారి విజయం సాధించారు. మల్లు రవి 10సంవత్సరాలు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మంద జగన్నాధం వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.

అందులో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. మందా జగన్నాధం మొత్తం 20సంవత్సరాలు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చని తర్వాత 2014లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నంది ఎల్లయ్య విజయం సాధించారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల కోసం ఇరు పార్టీలు సిద్దమవుతున్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్దులే విజయం సాధించారు. ఈసందర్భంగా 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్ధానంలో తొలి సారిగా గులాబి జెండా ఎగురవేయనందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య ఎటువంటి అభివృద్ది చేయకపోవడంతో ఆయనపై గుర్రుగా ఉన్నారు అక్కడి ప్రజలు.

- Advertisement -