ఆగస్టు నుండి రంగంలోకి దిగనున్న ‘బంగార్రాజు’..

24
Akkineni Nagarjuna

అక్కినేని హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నాగార్జున… నాగచైతన్య ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. మరోపక్క ఈ ఇద్దరూ కలిసి ‘బంగార్రాజు’ కోసం రంగంలోకి దిగేందుకూ సన్నద్ధమయ్యారు. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ రూపొందనుంది. ఈ మూవీ ఆగస్టు 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు.

ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. ఈ పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక ఖరారైపోయిందని తాజాగా అంటున్నారు. గ్రామీణ వాతావరణంలోనే ఈ కథ నడవనుంది. ‘సంక్రాంతి’ బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశంతో నాగ్ ఉన్నాడని అంటున్నారు. నాగార్జున – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా విజయాన్ని సాధించింది. మరి ‘బంగార్రాజు’ ఆ రేంజ్ లో దూసుకెళుతుందో లేదో చూడాలి. ‘మనం’ తర్వాత తండ్రీ కొడుకులు నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.