‘వైల్డ్ డాగ్’ ట్రైలర్..

322
Wild Dog
- Advertisement -

కింగ్ నాగార్జున దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ,అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం వైల్డ్ డాగ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.

ఈ చిత్రం ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, ‘నా సోదరుడు నాగ్ ఎప్పటిలాగానే కూల్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు’ అంటూ కితాబునిచ్చారు. ఏ జానర్‌లో ప్రయత్నించేందుకైనా నాగ్ వెనుకాడడని ప్రశంసించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఓ కంప్లీట్ యాక్షన్ మూవీకి ఉండాల్సిన కంటెంట్ వైల్డ్ డాగ్‌లో ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది.

- Advertisement -