ఏపీలో రాజకీయాలు ప్రపంచకప్ వన్డే క్రికెట్ మ్యాచ్ ఫైనల్‌ను తలపిస్తున్నాయి. ఓ వైపు నంద్యాల ఉప ఎన్నికలు పొలిటికల్ హిట్‌ని పెంచుతుండగా తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. అక్కినేని నాగార్జున అందరికీ అభిమాన హీరో.. మంచి వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరుంది. యువసామ్రాట్ ఎందరో హీరోలకు ఆదర్శప్రాయం.. ఆయన రూట్‌లోనే వాళ్లూ వ్యాపారాలు ఆరంభిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం …. వైసీపీలోకి వెళుతున్నారని వస్తోన్న వార్తలు రాజకీయ వర్గాల్లో మరింత వేడిని రాజేసింది.
నాగ్ వైసీపీ ఎంట్రీ వార్తలు గత ఆరేడు నెలలుగా వస్తూనే ఉంటున్నాయి. ఎందుకంటే నాగ్-వైఎస్ ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు. కాంగ్రెస్ పథకాలను ఫ్రీగా ప్రచారం చేశారు కూడా. ఆనాడు నాగార్జున వ్యాపారాలకు వైఎస్ అడ్డుపడలేదు.
ఇక నాగ్ వ్యాపార సన్నిహితులందరూ వైసీపీ అధినేత జగన్‌కు కావాల్సిన వారే. ఈ క్రమంలోనే నాగ్ ఏపీలో రాజకీయంగా వైసీపీకి దగ్గరవుతోన్నట్టు తెలుస్తోంది. వైఎస్ ఉన్నప్పటి నుంచే ఆ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నాగ్ ఆ తర్వాత జగన్‌తో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న ప్రచారం కూడా ఉంది. ఇక వీరిద్దరికి వ్యాపారంలో ఉన్న కామన్ ఫ్రెండ్స్ నాగ్‌ను వైసీపీలోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారట.
విజయవాడ లేదా గుంటూరు ఎంపీగా ఉంటే రాజధాని కేంద్రంగా ఏపీలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్లాన్‌లో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాగార్జున వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తే ఏపీలో వైసీపీకి అది చాలా బూస్టప్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై ఎన్ని వార్తలు వస్తున్నా నాగ్ మాత్రం నోరు విప్పడం లేదు. ప్రస్తుతం నాగ్ వైసీపీ ఎంట్రీ లేట్ వెనక మరో చర్చ కూడా నడుస్తోంది. జగన్ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఈడీ సాగుతున్న పోకడ కూడా నాగ్ ఓ కన్నేసి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. దీనిపై క్లారిటీ రాగానే నాగ్ వైసీపీ ఎంట్రీ ఉండొచ్చని టాక్.