ఒప్ప‌మ్‌ రీమేక్‌కి నాగ్‌ ఒప్పుకుంటాడా..?

261
Nagarjuna to be a blind man
Nagarjuna to be a blind man
- Advertisement -

తెలుగులో మనమంతా… జనతా గ్యారేజ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్. మోహన్‌ లాల్‌ ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి… దృశ్యం, ప్రేమ‌మ్ చిత్రాల క‌లెక్ష‌న్స్ ను క్రాస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

qgrjKscdgbffa_medium

మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఇంత‌లా ఆక‌ట్టుకున్న ఒప్ప‌మ్ క‌థ ఏమిటంటే….ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గుడ్డివాడిగా న‌టించారు. అయితే గుడ్డివాడైన మోహ‌న్ లాల్ ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా పని చేస్తుంటాడు. అంధుడైన హీరో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఆపరేటర్. ఓ రోజు ఆ అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. తప్పించుకున్న ఆ హంతకుణ్ణి హీరో ఎలా పట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ‘ఒప్పమ్’ రూపొందింది.

oopiri

తెలుగులో ఈ సినిమా రిమేక్‌కి మోహన్‌లాల్‌ పాత్రకు నాగార్జున అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. నాగ్‌ని సంప్రదించడానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఇటీవల ప్రయోగాత్మక పాత్రల్లో కనిపించడానికి నాగ్‌ ఉత్సాహం చూపిస్తున్నారు. ‘వూపిరి’ చిత్రంలో వీల్‌ఛైర్‌కే పరితమైన పాత్రలో కనిపించి సాహసం చేశారు. అందుకే నాగ్‌తో ఈపాత్ర చేయించాలని చిత్రబృందం ఆసక్తి చూపిస్తోందని సమాచారం. నాగార్జునా ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగ్‌ ఒప్పం సినిమాకు ఒప్పుకోకపోతే.. ఒప్పమ్‌ను తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఏది ఎలా ఉన్నా.. వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతున్న నాగ్‌ను అంధుడిగా చూడబోవచ్చన్న అంచనాల్లో అక్కినేని అభిమానులున్నారు.

ఇక రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘2.0’లో ప్రతినాయకుడిగా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్‌కుమార్ దృష్టి కూడా ‘ఒప్పమ్’పై పడిందట. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఆయన దక్కించుకోవాలనుకుంటున్నారని సమాచారం.

- Advertisement -