‘ది ఘోస్ట్’.. నాగ్ ఫస్ట్ లుక్ విడుదల..

36

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున ప్రస్తుతం డైరెక్టర్‌ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్,టైటిల్ విడుదల చేశారు చిత్ర బృందం. ది ఘోస్ట్ అనే టైటిల్‌తో చిత్రం తెర‌కెక్క‌నుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్‌తో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఉన్నారు నాగార్జున.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ్‌ ‘రా’ ఏజెంట్ పాత్రలో అలరించనున్నట్లు సమాచారం. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మొదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు ఆగింది. ఇటీవ‌ల తిరిగి మొద‌లు పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.