ఏ వయసులోనైనా ముద్దులు పెట్టుకోవచ్చుః నాగార్జున

362
nagarjuna
- Advertisement -

అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్మధుడు2. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ఆగస్ట్ 9న విడుదల కానుంది. ఈసినిమా ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈసినిమాలో నాగార్జున లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… ఈవయస్సులో లవ్ స్టోరీస్ ఎంటీ అని నన్ను చాలా మంది అడిగారు.. కానీ ఈసినిమా చాలా బాగా వచ్చింది. ఈసినిమా చూశాక వాళ్లకే అర్ధం అవుతుంది నేను ఈమూవీ ఎందుకు చేశానో..అందరూ నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. వయస్సు గురించి మాట్లాడటం నాకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పారు. ఇక ముద్దుల విషయానికి వస్తే..ముద్దులు, రోమాన్స్ ఏ వయసులోనైనా చేసుకోవచ్చని చెప్పారు. నాగార్జునకు సరైన హిట్ లేక చాలా కాలం అవుతుండటంతో ఈసినిమాపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాడు.

- Advertisement -