సన్నీపై నాగ్ ఫైర్..

75
sunny
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ 8 వారం ఎలిమినేషన్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ప్రతీవారంలాగే ఈ వారం వరస్ట్ కెప్టెన్ విషయంలో గందరగోళం నెలకొనగా ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీ జైలుకు వెళ్లారు. ఇక వీకెండ్ కావడంతో నాగ్ ఎంట్రీ ఇచ్చిన ప్రొమో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సన్నీ వ్యవహారంపై వీకెండ్‌లో నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. అందులో తనను ప్రొవోక్ చేశారని సన్నీ చెప్పినా… ‘అయినా మీదమీదకు వెళ్లిపోతావా? కాలితో తంతావా? నిన్ను ఎంతమంది పట్టుకుని ఆపారో తెలుసా?’ అంటూ నాగ్ మండిపడుతూ సన్నీ ఫోటో చింపేశాడు. మరోవైపు కాజల్‌కు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.

ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు ఉన్నారు. వారిలో లోబో, రవి, సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర ఉన్నారు. ఈ వారం లోబోకు చాలా తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అందువల్ల లోబో ఈ వారం ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.

- Advertisement -