త్వరలో అఖిల్‌తో మూవీ: నాగ్

54
- Advertisement -

త్వరలో అఖిల్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు తెలిపారు కింగ్ నాగార్జున. నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న దసరా రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరుగగా అఖిల్, చైతూ ఇద్దరు విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్… ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్‌ నిల్చున్నామంటే, మీ దగ్గరనుంచి ఇంత ప్రేమను పొందుతున్నామంటే దీనికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్యూ చెప్పుకోవాలన్నారు.

తాను, చైతన్య కలిసి చేసిన బంగార్రాజు థియేటర్స్‌లోనే కాదు, టెలివిజన్‌ లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. టీవిలో ఏ సినిమాకి రానంత టీఆర్పీ బంగార్రాజు సినిమాకి వచ్చింది. త్వరలో అఖిల్‌తో కూడా సినిమా చేయబోతున్నాను. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అని తెలిపారు.

- Advertisement -