1952లోనే ఇండియన్స్ ఫస్ట్ ల్యాప్‎టాప్ కనుగొన్నారు-నాగ్

228
Nagarjuna Say To Indians made the first laptop with Wi-fi & video
- Advertisement -

1952లోనే భారతీయులు ల్యాప్‎టాప్ కనిపెట్టారని టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటున్నారు. ఇదిగో ప్రూఫ్ కూడా ఉందంటూ. అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి నటించిన ‘మాయాబజార్’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ట్విటర్‎లో పోస్ట్ చేశాడు. ల్యాప్‎టాప్‎లో వైఫై కనెక్ట్ చేసి వీడియో చాటింగ్ కూడా చేసుకున్నారంటూ ట్విటర్లో మాయాబజార్‎లోని ఓ వీడియో పోస్టు చేశాడు. ‘డోంట్ మిస్ ఇట్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

ఈ వీడియోలో శశిరేఖ పాత్రలో మహానటి సావిత్రి నటిస్తూ, మనసులోని కోరికను చూపించే ‘ప్రియదర్శిని’ తెరిచి చూడగా ‘నీవేనా నను తలచినది’ అంటూ నాగేశ్వర్ రావు సాంగ్ పాడతాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మాయాబజార్ చిత్రంలోని ‘అహనా పెళ్లంట’ పాటను ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో చక్కగా చూపించారు. ఆమె పాత్రలో నటించిన కీర్తి సురేశ్ అచ్చం సావిత్రలాగే డ్యాన్స్ చేయడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మే 11న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది.

- Advertisement -