- Advertisement -
భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జలాశయానికి 5,28,314 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ప్రాజెక్టు 18 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 4,91,370 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.045 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.8 అడుగులు (308.46 టీఎంసీలు) గా ఉంది.కుడి కాల్వలకు 4 వేల క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్ర ద్వారా 29,063 క్యూసెక్కులు, పవర్ హూజ్ ద్వారా 3575 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
- Advertisement -