సాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..!

193
sagar
- Advertisement -

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని చెరువులు,కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి.శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతుండటంతో సాగర్ నీటిమట్టం గరిష్ట స్ధాయికి చేరుకుంది.

దీంతో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ్మయ్య, సీఈ నర్సింహా కలిసి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతిని బట్టి ఇంకా కొన్ని ఎత్తే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

సాగర్ పూర్తిస్ధాయి నీటి నిల్వ సామర్ద్యం 312.044 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 290 టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లోగా 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

- Advertisement -