నాగార్జున సాగర్ గేట్లు మూసివేత…

191
nagarjuna sagar
- Advertisement -

కొద్దిరోజులగా నాగార్జున సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరద ప్రవాహం తగ్గడంతో సాగర్ క్రస్ట్ గేట్లను మూసి వేశారు అధికారులు. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 312.04 టీఎంసీలుకాగా, ఇప్పుడు 310.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు.

శ్రీశైలం జ‌లాశ‌యానికి కూడా వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 55,246 క్యూసెక్కుల నీరు వ‌స్తుండ‌గా, 55,185 క్యూసెక్యుల నీటిని వ‌దుల‌తున్నారు. కుడిగ‌ట్టు జ‌లవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి కొన‌సాగుతోంది.

- Advertisement -