నల్లగొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గౌడన్స్ లో సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రెండు హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు……..మెత్తం 25 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ప్రకారం కోవిడ్ నిభంధనల్ని కఠినంగా అమలు చేస్తూ కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్స్ లోకి అనుమతించనున్నారు.
అథరైజ్డ్ పాసులు ఉన్న వారికి, సిబ్బందికి, అభ్యర్దులకు, ఏజెంట్లకు కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు… నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి …. ఏజెంట్లకు పీపీఈ కిట్లు కూడా అందజేస్తున్నరు…..కౌంటింగ్ కేంద్రాన్ని మెత్తం ప్రతి మూడు గంటలకు ఒక సారి శానిటైజ్ చేస్తున్నరు…..ప్రతి ఒక్కరికి మాస్క్ లు తప్పనిసరి చేశారు.
ఉదయం 7 గంటలకు అభ్యర్దులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం ఒపెన్ చేసి ఈవీఎం లను కౌంటింగ్ హాల్స్ తరలిస్తారు….,ముందుగా నియోజకవర్గంలో ఉన్న 1500 పోస్టల్ బ్యాలట్ ఒట్లను లెక్కించి సరిగ్గా 8 గంటలకు ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.ఇందు కోసం మెత్తం 2 హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు……ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సుపర్ వైజర్ , అసిస్టెంట్ సుపర్ వైజర్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు.మెత్తం 400 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు…వీరికి మూడు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు….
.. కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్ , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ ఓ రోహిత్ సింగ్ .ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, నోడల్ అధికారి రాజ్ కుమార్ లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షణ ……. 300 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు… మూడంచెల భద్రత వ్యవస్దను ఏర్పాటు ….144 సెక్షన్ అమలు … ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా పార్టీలు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించకుండా ప్రజలు గుమికూడకుండా పోలీసులు భారీ బందోబస్త్ ….. కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు ఎవ్వరు తండోప తండోలుగా గుంపులు గుంపులు గా కౌంటింగ్ కేంద్రం వద్దకు రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.