నాగార్జునసాగర్ 26 గేట్లు ఓపెన్..

7
- Advertisement -

కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ కు వరద పోటెత్తింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2లక్షల, 73వేల, 370 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.58 టీఎంసీలకు చేరుకుంది.

ఇక నాగార్జున సాగర్‌ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుంది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 2,45, 682 క్యూసెక్కులుగా ఉంది.పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 167.94 అడుగులకు చేరుకుంది.

Also Read:మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

 

- Advertisement -