- Advertisement -
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. భారీగా చేరుకుంటున్న వరద నీటితో నాగార్జున సాగర్ 16 క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. 10 ఫీట్ల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,77,300 క్యూసెక్కులు కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 2,94,300 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.2522 టీఎంసీలుగా ఉంది.
అటు శ్రీశైలంకు కూడా వరద నీరు పొటెత్తడంతో ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3.49 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3.55 లక్షలుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్ధాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగుల నీరు నిల్వ ఉంది. పూర్తిస్ధాయి నీటి నిల్వ సామర్ద్యం 215.80 టీఎంసీలు కాగా 215.32 టీఎంసీల నీరు ఉంది.
- Advertisement -