సాగర్‌కు పోటెత్తిన వరద..

63
nagarjuna sagar
- Advertisement -

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 12 గేట్లు 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,3,099 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.

సాగర్‌ పూర్తిస్థాయి నీటమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 312 టీఎంసీలుకాగా ఇప్పుడు 309 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. కుడి కాలువకు 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1795 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,044 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

- Advertisement -