అక్కినేని నాగార్జున..దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలయిక అంటే ముఖ్యంగా భక్తిరస ప్రధాన చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్ లో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడి సాయి’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తోంది. అదే ‘ఓం నమో వెంకటేశాయ’.
ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో ‘అక్కినేని నాగార్జున’ ‘హాథీరామ్ బాబా’గా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు ‘కె.రాఘవేంద్రరావు’ తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఇందులోభాగంగా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్‌ని రిలీజ్ చేశాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఓ వైపు సెట్స్‌లో సూర్య నమస్కారాలతో నాగార్జున హంగామా చేశాడు.
ఇటు బ్రహ్మనందం కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ రోల్స్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. హథీరాం బాబాగా నాగార్జున, మహాభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించారు. శ్రీనివాసుడి క్యారెక్టర్లో టీవీ నటుడు సౌరబ్ నటిస్తున్నాడని టాక్.
ఫొటోలో ‘బ్రహ్మనందం’ కూడా ఉండడం బట్టి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా ‘అనుష్క’, ‘ప్రగ్యా జైస్వాల్’ నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.