ఏఎన్నార్ బయోపిక్‌పై స్పందించిన నాగ్..

279
anr-nagarjuna
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని సినీ పరిశ్రమలో నేడు ప్రముఖుల జీవిత చరిత్రలను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్రను బయోపిక్‌గా రూపొందించిన సినిమా ‘మహానటి’. ఈ చిత్రం ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

akkineni-nageswara-rao

ఇక దివంగత మాజీ సీఎం, నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్‌ను ‘ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కిస్తుండగా  వైఎస్సార్  జీవిత చరిత్రను కూడా ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారని గతంలో వార్తలు వినిపించాయి. అలాంటి వార్తల ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జున సమాధానం ఇచ్చారు.

ఆయన నటించిన ‘ఆఫీసర్’ మూవీ ప్రమోషన్లో భాగంగా తన తండ్రి బయోపిక్‌పై స్పందిస్తూ.. నాన్న జీవిత చరిత్రను బయోపిక్‌ కన్నా పుస్తకంగా తెస్తే బాగుంటుదని ఆయన తెలిపారు. నాన్న గారి జీవితం అందంగా, ఆదర్శవంతంగా సాగింది. కొంచమైన నెగిటివ్ టచ్ ఉండాలి. అది లేనిది జనాలకు నచ్చదని నా అభిప్రాయం అని తెలియజేశారు.

- Advertisement -