యూఏఈకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త దాదాపు రూ.వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో మహాభారతం సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాసుదేవనాయర్ స్ర్కీన్ ప్లే రాస్తున్నారు. దీంతో బాహుబలి తర్వాత మహాభారతంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే భారీ బడ్జెట్‌తో మహాభారతం సినిమాపై కింగ్ నాగార్జున అనుమానం వ్యక్తంచేశాడు.
ఆ సినిమా వస్తుందా..నాకు డౌటే” అని రివర్స్ లో క్వశ్చన్ చేశాడు. రారండోయ్ వేడకుచూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహాభారతం మూవీపై స్పందించిన నాగ్…ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందో లేదో తను చెప్పలేనని.. సినిమా ఇప్పట్లో రాదని ఆఫ్ ది రికార్డు తేల్చిచెప్పేశాడు.
మహాభారతం’లో నన్ను కర్ణుడి పాత్ర చేయమని అడిగారు. అయితే సినిమా ఆన్ కార్డ్స్‌లో ఉంది. శ్రీకుమార్ నాలుగేళ్లుగా ఈ కథపై కసరత్తులు చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే వాసుదేవనాయర్ కర్ణుడు పాత్ర చేయమని అడిగారు. నాకు కూడా చేయాలని ఆసక్తి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి” అని చెప్పుకొచ్చారు నాగార్జున.
కృష్ణుడి పాత్రకు అమీర్‌ఖాన్‌ని సంప్రదిస్తున్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై నాగ్ స్పందిస్తూ.. ”మిగిలిన పాత్రలకు ఎవరెవరిని తీసుకొన్నారో నాకు తెలీదు. మోహన్ లాల్ మాత్రం ఉన్నారు. కాస్టింగ్ ఫైనలైజ్ అవ్వడానికి టైమ్ పడుతుంది” అన్నారు నాగ్. మరి కృష్ణుడి పాత్ర మీరే చేయొచ్చు కదా అని అడిగితే… ”దాని కోసం మీసాలు తీసేయాలి.. అలా తీస్తే ఫ్యాన్స్ చూడలేరేమో” అంటూ నవ్వేశారు నాగార్జున.