నాగ్‌తో కలిసి నాని వస్తున్నాడు..!

194
- Advertisement -

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్టీస్టార‌ర్ రూపుదిద్దుకోబోతోంది. నాగార్జున‌, నాని క‌ల‌సి ఓ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ అనేవి చాలా తక్కువ. కాని మొన్నామధ్యన ‘ఊపిరి’ సినిమాతో కింగ్ నాగార్జున్ కూడా.. కార్తి తో కలసి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వెంకటేష్ తరువాత మల్టీస్టారర్ ను ఓకే చేసిన సీనియర్ హీరో ఆయనే. అయితే తన కుటుంబ హీరోలతో మనం చేసిన ఆయన.. ఇప్పుడు మరో హ్యాపెనింగ్ హీరోతో ఒక సినిమా మొదలెడుతున్నారు.

సీనియర్ హీరో నాగార్జున.. న్యాచురల్ స్టార్ నాని కలయికలో ఒక సినిమా రాబోతోందని అధికారికంగా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి ఆ సినిమా స్టార్ట్ కానుందని సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ ఆ సినిమాను నిర్మించనున్నారు. ఇక భలే మంచి రోజు – శమంతకమణి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నాడు.

Nagarjuna-Nani’s multi-starrer to roll out in February!

ఫిబ్రవరిలో సినిమా లాంచింగ్ కార్యక్రమాలను ఘనంగా జరిపి.. వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఆ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుందట. నాగార్జున సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగ్ వైజయంతి మూవీస్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇక నాని ఇంతకుముందు వారి ప్రొడక్షన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ్‌ వర్మ సినిమాతో బిజీగా ఉండగా నాని యంసీఏ మూవీలో నటిస్తున్నాడు.

- Advertisement -