నాగ్‌తో నాని..?

236
- Advertisement -

వరుస విజయాలతో సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు నేచురల్‌స్టార్‌ నాని. ఇప్పటికీ  నాని అదే ఫామ్‌ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ‘నేను లోకల్‌ ‘ అంటూ సూపర్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న నానీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదే దూకుడును ప్రదర్శిస్తూ.. మరో సినిమాకి గ్యాప్‌ లేకుండా కమిట్‌ అయ్యాడు నాని. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Nagarjuna MultiStarrer with Hero nani
అయితే ఈ సినిమా తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఎంసీఏ’ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆ తర్వాత నాని ఓ మల్టీస్టారర్‌ మూవీలో కనిపించననున్నాడట. తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారి ఓ పెద్ద హీరోతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నాడట నాని.  గతంలోనూ కొన్ని మల్టీస్టారర్‌ సినిమాలు చేసిన నాని.. పెద్ద హీరోతో మాత్రం కలిసి నటించలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘కింగ్‌’ నాగార్జునతో కలిసి నాని ఓ సినిమాలో నటించనున్నాడని టాక్‌. నాగార్జున మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. కార్తీతో కలసి ‘ఊపిరి’లో కేవలం వీల్ చైర్‌కే పరిమితమైన రోల్ చేసి గట్స్‌వున్న స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ‘ఊపిరి’ సక్సెస్‌తో నాగార్జున యంగ్ హీరోలతో మరిన్ని మల్టీస్టారర్‌లు చేయడానికి రెడీ అవుతున్నాడు.
 Nagarjuna MultiStarrer with Hero nani
ఇక ఇదే క్రమంలో ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగార్జున, హీరో నానితో ఓ మూవీ ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో నాగ్‌, నిఖిల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి. మరి, ఏమైందో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు నిఖిల్‌ స్థానంలోకి నాని వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక ఈ మల్టిస్టారర్‌లో నాగ్ తో నానికి నటించే ఛాన్స్‌ వస్తే మాత్రం నానీ కెరీర్‌ సక్సెస్‌ జోన్‌ లో పడ్డట్టేనని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

- Advertisement -