Nagarjuna:అభిమానిని కలిసిన నాగ్

12
- Advertisement -

కింగ్ నాగార్జునకు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ అభిమానికి నాగ్ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కింద‌ప‌డిన అభిమానిని నాగార్జున క‌లుసుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా అత‌డిని క‌లుసుకోగా నాగార్జున‌ను క‌లిసిన ఆనందంలో అత‌డికి బోకే గిప్ట్‌గా ఇచ్చాడు ఆ అభిమాని. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

నాగార్జున ‘కుబేర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి నాగార్జున బయటికి వస్తుండగా అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఆ అభిమాని విక‌లాంగుడు అని కూడా చూడకుండా సెక్యురిటీ గార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనికి క్షమాపణ చెప్పారు నాగ్.

Also Read:థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్

- Advertisement -