పెళ్లైనా సినిమాలు చేస్తుందట…

253
Samantha Opens Up Naga Chaitany
Samantha Opens Up Naga Chaitany
- Advertisement -

పెళ్లి తరువాత హీరోయిన్లు నటించే సాంప్రదాయం టాలీవుడ్ లో లేదనే చెప్పాలి. పురుషాధిక్య సమాజంలో హీరోలు మాత్రమే పెళ్లికి ముందు తరువాత నటించే సాంప్రదాయం ఉంది.

Samantha Opens Up Naga Chaitany

హాలీవుడ్.. బాలీవుడ్ లు పక్కనపెడితే.. దక్షిణాదిలో పెళ్లి తరువాత హీరోయిన్లు నటనకు దూరం అవుతున్నారు. త్వరలో నాగ చైతన్యను వివాహం చేసుకోనున్న సమంత ఈ విషయంలో తన పంతం నెగ్గించుకుందని సమాచారం. కెరియర్ కు గుడ్ బై చెబితేనే నాగ్.. చైతుతో పెళ్లికి ఓకే అన్నాడని వార్తలు వినిపించినా.. ఇందులో నిజం లేదని తెలుస్తోంది. సమంతకు కెరియర్ విషయంలో అక్కినేని ఫ్యామిలీ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిందని టాక్.

Samantha Opens Up Naga Chaitany

అయితే సమంత సాంప్రదాయ పాత్రలు మాత్రమే చేయాలన్నది వారి కోరిక. దీంతో ఇప్పటికే సామ్ కొన్ని టాప్ సినిమాలో అవకాశాలు వస్తే వాటిని తిరస్కరించిందట. ఇక నుంచి సంప్రదాయబద్దమైన పాత్రల్లోనూ… అదికూడా అతి తక్కువ సినిమాల్లో మాత్రమే చేస్తానని సమంత నిర్మాతలకు చేప్పేసిందట.

Samantha Opens Up Naga Chaitany

ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసి బ్రేక్‌ తీసుకోవాలి అని చూస్తుందట. పెళ్లి తరువాత సినిమాల్లో నటించేందుకు నాగచైతన్య కూడా సరే అనేశాడట.దీంతో సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం సమంత చెన్నైకే అంకింతం అయ్యింది. అయితే అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి అక్కినేని ఇంట్లో సందడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Opens Up Naga Chaitany

 

- Advertisement -