తెలుగు మూవీ ‘రన్ రాజా రన్’ ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన హీరోయిన్ సీరత్ కపూర్… ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. తర్వాత టైగర్, కొలంబస్ లాంటి సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద సరిగా ఆడలేదు. చేసేదేంలేక తిరిగి ముంబై వెళ్లిన ఈ భామ చేతిలో కావాల్సినన్ని అవకాశాలు లేక పోయినా, చెప్పుకోదగ్గ హిట్స్ లేక పోయినా….. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికి తన ప్రయత్నాలు తాను చేసింది. ఇందులో భాగంగా సీరత్ కపూర్ రిలీజ్ చేసిన సెమీ న్యూడ్ ఫోటో షూట్ స్టిల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సీరత్‌కు ఆఫర్లు వస్తున్నాయి. అయితే సీరత్‌కి ఇలాంటి హాట్ ఫోటో షూట్‌లు మానుకోమని చెప్పి షాక్ ఇచ్చాడట నాగార్జున.
రాజుగారిగది 2′ షూటింగ్ సమయంలో సీరత్‌కి నాగ్ క్లాస్ తీసుకున్నారని, ఆయన సలహా మేరకు సీరత్ తన పద్ధతి మార్చేసుకుందని, హాట్ ఫోటోషూట్లు మానేసిందని సమాచారం. . సీరత్‌లో సడన్‌గా వచ్చిన ఈ మార్పుకి నాగార్జునే కారణమని, ఆమెకి తన బ్యానర్లో తీసే సినిమాలో అవకాశమిస్తానని నాగ్ మాట ఇచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈమధ్య కాలంలో ఆమె మళ్లీ హాట్ ఫోటోల్లాంటివి సోషల్ మీడియాలో పెట్టలేదు. పీవీపీ సంస్థ భారీగా నిర్మిస్తున్న రాజుగారి గది 2 సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా నాగ్ పాత్రే సినిమాకు కీలకం అన్న టాక్ వినిపిస్తోంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది సినిమా పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సిక్వెల్‌గా రాజుగారి గది 2 తెరకెక్కుతోంది.