ముందు చెప్పాను.. ఇప్పుడు కూడా చెప్తున్నాను !

226
Nagarjuna happy for Rarandoi Veduka Choodham
Nagarjuna happy for Rarandoi Veduka Choodham
- Advertisement -

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం ‘రారండోయ్‌ ..వేడుక చూద్దాం’. మే 26న వరల్డ్‌వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మే 27న హైదరాబాద్‌ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో సక్సెస్‌మీట్‌ జరిగింది.

ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”రారండోయ్‌ వేడుక చూద్దాం’ రిలీజ్‌ కోసం గత నెల రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అమల హాలిడే ట్రిప్‌కి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లలేదు. సినిమా రిలీజై సూపర్‌హిట్‌ అయ్యింది. అందరం చాలా హ్యాపీగా వున్నాం. రేపే హాలిడే ట్రిప్‌కి వెళ్తున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఓన్‌ చేసుకోవడమే. థియేటర్స్‌ నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుండి కళ్యాణ్‌ కృష్ణ చాలా కష్టపడ్డాడు. అలాగే 44 ఏళ్ల ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌ వున్న సత్యానంద్‌గారు మా పక్కనే వుండి అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే జీ.కె. మోహన్‌ కూడా చాలా హెల్ప్‌ చేశారు. సినిమా సక్సెస్‌లో ఇంతమంది భాగమైనా కూడా జీకె మోహన్‌, కళ్యాణ్‌ కృష్ణ, సత్యానంద్‌గారే బ్యాక్‌ బోన్‌గా వున్నారు. సినిమాటోగ్రాఫర్‌ విశ్వేశ్వర్‌ ప్రతి సీన్‌ని బ్యూటిఫుల్‌గా చూపించాడు. చైతన్య, రకుల్‌ప్రీత్‌, జగపతిబాబు, సంపత్‌ సహా ప్రతి ఒక్కరూ మంచి ఎమోషన్‌గా నటించారు. డిఎస్‌పి సంగీతం అందించడమే కాదు సినిమాలో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. బ్రేకప్‌ సాంగ్‌ లిరిక్స్‌ తనే రాయడమే కాకుండా పాడాడు కూడా. అలాగే ‘తికట తకుజుం’, ‘భ్రమరాంబకు నచ్చేశానే’, టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్నీ సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దేవి ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్‌ అందించాడు. తండ్రి అంటే ఇలా వుండాలి అనేలా జగపతిబాబు చాలా బాగా చేశారు. రకుల్‌, సంపత్‌ల మధ్య సీన్స్‌ కూడా ఎమోషనల్‌గా వుంటాయి. ఒక హీరోయిన్‌ను క్యారెక్టర్‌ పరంగా రేర్‌గా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి క్యారెక్టర్స్‌ ఈమధ్య సినిమాల్లో చాలా రేర్‌గా వుంటున్నాయి. అలాంటి భ్రమరాంబ క్యారెక్టర్‌ను రకుల్‌ ప్రీత్‌ చాలా చాలా బాగా చేసింది. ఏ హీరో అయినా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోడానికి ఇష్టపడ్తాడు. ఈ సినిమాలో కూడా చైతు పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడుతున్నారు. బీచ్‌ సీన్‌లో చైతు పెర్‌ఫార్మెన్స్‌కి ఈలలు వేస్తున్నారని తెలిసి హ్యాపీగా అన్పించింది. రిలీజ్‌కి ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా హీరో సూపర్‌. హాలీడే తర్వాత నా నెక్స్‌ట్‌ మూవీ గురించి ఆలోచిస్తాను. ‘సోగ్గాడే చిన్నినాయనా’ నచ్చడంతో ‘బంగార్రాజు’ టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాను. కథని కళ్యాణ్‌ కృష్ణ రెడీ చెయ్యాలి, నాకు నచ్చాలి. ‘రాజుగారి గది-2’ సినిమా పూర్తి చెయ్యాలి. అలాగే అఖిల్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. జూన్‌ 6న అఖిల్‌ సినిమా షెడ్యూల్‌ వుంది. ఇవన్నీ హాలిడే నుండి వచ్చిన తర్వాతే ఆలోచిస్తాను” అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ – ”నేను చేసిన సినిమాల్లో ‘రారండోయ్‌ ..వేడుక చూద్దాం’కి బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ముందుగా నాన్నగారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. సినిమా ప్రీ ప్రొడక్షన్‌, షెడ్యూల్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌తో సహా మా వెన్నంటే వుండి ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. కళ్యాణ్‌ కృష్ణ శివ అనే క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్‌ చేశారు. నా క్యారెక్టర్‌కి ఇంతటి అప్లాజ్‌ వస్తుందంటే కళ్యాణ్‌ కృష్ణే కారణం. నాపై నమ్మకం వుంచినందుకు కళ్యాణ్‌ కృష్ణకి థాంక్స్‌. రకుల్‌ భ్రమరాంబ క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేసింది. జగపతిబాబు, సంపత్‌, సత్యానంద్‌, డిఎస్‌పి సహా అందరికీ స్పెషల్‌ థాంక్స్‌” అన్నారు.

Rarandoi (5)

దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ – ”నేను ఏం మాట్లాడినా థాంక్స్‌ చెప్పుకోవాల్సింది ముందుగా నాగార్జునగారికే. ఆయన లేకుంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘రారండోయ్‌ ..వేడుక చూద్దాం’ సినిమాలు, ఈ సక్సెస్‌లు వుండేవి కావు. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఆయన దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. శివ పాత్రలో చైతు అద్భుతంగా చేశాడు. నేను థియేటర్‌లో సినిమా చూసినప్పుడు నాకే రెండు, మూడు సీన్స్‌లో కళ్లలో నీళ్లు తిరిగాయి. శివలాంటి మెచ్యూర్టీ క్యారెక్టర్‌ చేయడం అంత ఈజీకాదు. చైతు తన నటనతో డబుల్‌ ఇంపాక్ట్‌ చూపించారు. జగపతిబాబు, సంపత్‌గార్లతో సహా అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు స్క్రీన్‌ప్లే అందించిన సత్యానంద్‌గారు ‘రారండోయ్‌ ..వేడుక చూద్దాం’కి కూడా స్క్రీన్‌ప్లే అందించి సక్సెస్‌లో భాగమైనందుకు ఆయనకు థాంక్స్‌. దేవిశ్రీప్రసాద్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. జీకె మోహన్‌గారు బాగా సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా సినిమా లేడీస్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసినందుకు థాంక్స్‌” అన్నారు.

సత్యానంద్‌ మాట్లాడుతూ – ”సినిమాని చూసిన ప్రేక్షకులందరూ మరోసారి సినిమాను చూతమురారండీ.. వేడుక చేద్దాం రారండీ అంటున్నారు. సాధారణంగా నిర్మాత అంటే డబ్బులు పెట్టడం వరకే అనుకుంటారు. కానీ నాగార్జునగారు ఈ సినిమా ఏ రేంజ్‌ హిట్‌ కావాలి అనే దాన్ని కూడా ఆలోచించి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. అలాగే ఈ సినిమా గ్యారెంటీ హిట్‌ అవుతుంది అని చైతుకి చెప్పి.. ఆ నమ్మకాన్ని నిజం చేసిన తండ్రిగా కూడా సక్సెస్‌ అయ్యారు. చైతన్య కెరీర్‌లో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. రకుల్‌ తన క్యారెక్టర్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. జగపతిబాబు, సంపత్‌, దేవిశ్రీ, విశ్వేశ్వర్‌ సహా అందరూ విజయంలో తమవంతు పాత్ర పోషించారు” అన్నారు.

డి.ఓ.పి. ఎస్‌.వి. విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా సక్సెస్‌ నాగార్జునగారి విజనే. ఆయన విజన్‌లో కళ్యాణ్‌ కృష్ణ, నేను, చైతు, రకుల్‌, సత్యానంద్‌గారు, జగపతిబాబుగారు, సంపత్‌గారు ఇలా ప్రతి ఒక్కరూ భాగమయ్యాం. నాకు ఇదొక గ్రేట్‌ జర్నీ” అన్నారు.

- Advertisement -