‘ది ఘోస్ట్’ తర్వాత నాగార్జున నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. నాగ్ ఇంకా డిస్కషన్ లోనే ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా నాగార్జున ఓ మలయాళం రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. మలయాళం లో సూపర్ హిట్ అనిపించుకున్న ‘పోరింజు మరియం జోస్ ‘ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.
ఈ రీమేక్ సినిమాతో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట నాగ్. ఈ కాంబో సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టురి నిర్మిస్తారని టాక్. ఈ సినిమాకు సంబందించి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవనుందని అంటున్నారు.
బంగార్రాజు తో సంక్రాంతి హిట్ కొట్టిన నాగార్జున ది ఘోస్ట్ తో ఫ్లాప్ అందుకున్నాడు. చిరు గాడ్ ఫాదర్ కి పోటీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. మరి ఈ మలయాళం రీమేక్ తో నాగ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..