నానికి నాగ్ ఫిట్‌నెస్‌ సవాల్‌..

285
nagarjuna nani
- Advertisement -

కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లో భాగంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే చైతూ,బెల్లంకొండ శ్రీనివాస్ సహా పలువురు ఛాలెంజ్‌ని స్వీకరించగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నేను సైతం అంటూ చేరిపోయారు. మోహన్ లాల్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన తారక్‌…రాంచరణ్‌,మహేష్ బాబు,రాజమౌళి,కొరటాల శివకు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు.

తాజాగా కింగ్ నాగార్జున..అఖిల్ విసిరిన ఛాలెంజ్‌కు సమాధానం ఇచ్చాడు. జిమ్‌లో తాను వర్కవుట్స్ చేసిన వీడియోని షేర్ చేసి మరికొంతమంది సెలబ్రిటీలకు సవాల్ విసిరారు. నాని, కార్తి, హీరోయిన్ శిల్పారెడ్డిలు తమ ఫిట్ నెస్ వీడియోలు పోస్ట్ చేయాలని కోరారు. నాగ్ చేస్తున్న ఎక్సర్ సైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగార్జున-నాని ఓ మల్టీస్టారర్ లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -