కొండా కామెంట్స్‌ అసంబద్ధం:నాగ్

6
- Advertisement -

సంమతపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగ్.. మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండని సూచించారు.

దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అన్నారు.

 

Also Read:మంత్రి కొండాకు కేటీఆర్ లీగల్ నోటీసులు..

- Advertisement -