ఎట్టకేలకు నాగార్జున ఒప్పేసుకున్నాడోచ్

26
- Advertisement -

బెజవాడ ప్రసన్న కుమార్…ఎలా కిట్టించినా, ఏం చేసినా, టాలీవుడ్ లో మంచి కమర్షియల్ కథకుడిగా స్ధిరపడ్డాడు. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, పాగల్, నా సామిరంగ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐతే, మనోడు డైరక్టర్ గా మారాలి అనుకోవడంతోనే వచ్చింది సమస్య. ఏదో పాత సినిమాను అటు ఇటు మార్చి ఓ సబ్జెక్ట్ తయారు చేసి.. నాగార్జునకు కథ కూడా చెప్పాడు. ఇలాంటి కథలన్నీ ఒప్పుకుని నాగార్జున ఈ మధ్య దారుణమైన, భయంకరమైన పరాజయాలను మూటకట్టుకున్నాడు.

అప్పటి నుంచీ నాగ్ కి చేదు అనుభవాలు తప్పలేదు. ఆఖరికి, నా సామిరంగ సినిమా సెట్ అయింది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే, ఈ సినిమా తర్వాత బెజవాడ ప్రసన్న కుమార్ సినిమాకి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. కథ, దర్శకత్వం రెండూ బెజవాడ ప్రసన్న కుమార్ వే. నిజానికి ఇది సెట్ అయి ఏడాది కావస్తోంది. మొదలై చాలా అంటే చాలా నెలలు దాటుతోంది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నట్లు వుంది పరిస్థితి. బెజవాడ ప్రసన్న కుమార్ పై నాగ్ కి ఎక్కడో గురి కుదరలేదు అని టాక్ వినిపిస్తోంది.

ఈ కారణంగానే ఈ సినిమా రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు పడింది. అందుకే, ఈ కథ మీద ఎప్పటి నుంచో కసరత్తు చేస్తూ వస్తున్నారు బెజవాడ ప్రసన్న కుమార్. ఆయనకు సరిపోక, ఓ టీమ్ ను కూడా పెట్టుకుని, అక్కడి నుంచి ఐడియాలు తీసుకుని కుస్తీ పట్టారు. తర్వాత ఏకంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్ లోనే కథ మీద కసరత్తు ప్రారంభించారు బెజవాడ ప్రసన్న కుమార్. మొత్తానికి కథ పై ఓ కొలిక్కి వచ్చారు. దాంతో నాగార్జున కూడా షూటింగ్ సై అన్నట్టు టాక్. కాబట్టి ఈ నెల ఎండింగ్ నుంచి ఈ సినిమా మొదలు కాబోతుందట. మొత్తానికి ఎట్టకేలకు నాగార్జున ఒప్పేసుకున్నాడు.

Also Read:BJP: బీజేపీలో ‘కొత్త ఇంచార్జ్ లు’..కొత్త వ్యూహాలు!

- Advertisement -