‘శివ’ సీక్వెల్ పై నాగ్ ఏమన్నాడు..

97
Nagarjuna about Shiva Sequel

నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సెన్సేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, శివ సీక్వెల్‌పై కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో శివ 2 పై క్లారిటీ ఇచ్చాడు నాగ్. హైదరాబాద్‌లో శివ టు వంగవీటి: ద జర్నీ ఆఫ్ ఆర్జీవీ కార్యక్రమంలో మాట్లాడిన నాగార్జున…తనను శివ సీక్వెల్‌పై చాలా మంది సంప్రదించారని తెలిపారు. అయితే, తాను మాత్రం రాము తీస్తానంటేనే ‘శివ–2’ చేస్తా. లేకపోతే చేయను’’ తేల్చిచెప్పారు నాగ్.

ఓ దర్శకుడిగా కంటే ఓ స్నేహితుడిలా రాము అంటే నాకు ఇష్టం. అప్పట్లో నేనెవరితోనూ పెద్దగా కలిసేవాణ్ని కాదు. రామూతో తప్ప. శివలాంటి కథ చెప్పాడని కాదు. తనతో కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. బ్రూస్లీ, గాడ్‌ ఫాదర్‌, నక్షత్రాలు, విశ్వం… ఇలా ఎన్నో టాపిక్కులు. ‘శివ’ నా జీవితాన్నే కాదు తెలుగు సినిమానీ మార్చిందన్నారు. దేశంలోని ఉత్తమ వంద సినిమాల జాబితా తీస్తే అందులో ‘శివ’ కూడా ఉంటుందన్నారు.

ఎవరైనా ‘నా ఇష్టం’ అనే పుస్తకం రాసుకొని, తనకి తాను అంకితం ఇచ్చుకొంటారా? అందుకే వర్మ అంటే నాకిష్టం. నాకు బోర్‌ కొట్టినప్పుడల్లా వర్మ ట్విట్టర్‌ ఖాతా తెరుస్తా. మనసులో ఏం అనుకొన్నాడో అదే చెబుతాడు. వర్మా… నువ్వు ఏం అనుకొంటే అది చేయ్‌. ఇలా ఒట్లు వేయకు. ‘శివ 2 చేద్దాం..’ అని చాలామంది దర్శకులు నన్ను అడుగుతారు. కానీ ఆ సినిమా చేస్తే రామూతోనే చేస్తా. లేదంటే అస్సలు ముట్టుకోను..’’ అన్నారు.వర్మ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘వంగవీటి’. దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా 23న రిలీజవుతోంది.