ఏఎన్నార్‌ బయోపిక్‌..నాగ్ క్లారిటీ..!

234
anr biopic
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.సినీ,రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఆసక్తిచూపిస్తున్నారు. టాలీవుడ్‌లో విడుదలై సావిత్రి బయోపిక్‌ భారీ హిట్ కొట్టడంతో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. ఇటీవలె మాజీ సీఎంలు ఎన్టీఆర్,వైఎస్‌ఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా విడుదలై మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా మరో బయోపిక్‌ తెరకెక్కనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రారంభమైన నాటి నుండి ఏఎన్నాఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రానుందని టీ టౌన్‌ కోడైకూసింది. ఈ నేపథ్యంలో ఏఎన్నాఆర్ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చారు నాగార్జున… నాన్నగారి జీవితంలో ఒక సినిమాకు కావలినంత డ్రామా లేదు.. బయోపిక్‌కు అవసరమైన కంటెంట్ లేదు అన్నారు. ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదని తెలిపారు.

ప్రస్తుతం నాగ్‌..రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -