రోజాకు కీలక పదవి ఇచ్చిన ఏపీ సీఎం జగన్…

301
MLA Roja
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కు కీలక పదవి కట్టబెట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే, పలు సమీకరణాల కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమెను ఏఐసీసీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

మరోవైపు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌లో పనిచేసి కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఏవీ ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. టీటీడీ జేఈవోగా తిరిగి రావాలన్న ఆయన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో కేంద్రం ఆయన డిప్యుటేషన్‌కు అంగీకరించింది.

- Advertisement -