నగరంలో ముగిసిన ఈ రేసు…

55
- Advertisement -

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఈ ఫార్ములా రేసులు హైదరాబాద్‌లో ఘనంగా ముగిశాయి. హూస్సేన్ సాగర్‌ తీరాన ఏర్పాటు చేసిన ఈరేసు ట్రాక్‌పై 11టీమ్‌ 22మంది డ్రైవర్లు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్‌, చాహల్‌, ధావన్‌ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు. ఈ రేసు కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో హోరిత్తిపోయింది. ఈ రేసులో జీన్ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలచారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు.

2014లో బీజింగ్‌లో ఈ రేస్ ప్రారంభం కాగా చివరి సారి దక్షిణ కోరియా రాజధాని సియోల్‌లో జరిగింది. కాగా దిరియా మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్‌, లండన్, జకార్తా, సియోల్‌ వంటి నగరాల్లో ఈ పోటీ యేటా జరుగుతుంది. దీంతో ఫార్ములా ఈ రేస్‌ పోటీలకు శాశ్వత హోస్ట్‌గా హైదరాబాద్‌ నిల్వనున్నట్టు నిర్వహకులు ప్రకటించారు. ఈరేసు పోటీని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగనుంది.

ఇవి కూడా చదవండి…

ఐపీఎస్‌…74వ పాసింగ్ పరేడ్

భవిష్యత్‌ ఎలక్ట్రిఫైయింగ్‌: మహీంద్రా

యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉంది:వైట్‌హౌజ్‌

- Advertisement -