కేసీఆర్ కు మాత్రమే సాధ్యం..

252
KCR Spoke to Nagamani
KCR Spoke to Nagamani
- Advertisement -

తెలుగు వారి తొలి పండుగ ఉగాది. తొలి పండుగ కానుకగా డబుల్‌ బెడ్ రూం ఇల్లు రావడమే అదృష్టంగా ఫీలవుతారు. దాంతో పాటు బోనస్‌గా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కూడా వస్తే.. ఇంకేమంది సంతోషం రెట్టింపవుతుంది. అలాంటి ఘటనే ఖమ్మం గ్రామీణ మండలం మద్దులపల్లికి గొల్లపుడి నాగమణికి జరిగింది.

బుధవారం రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులంతా సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఇదిలా ఉండగా..గురువారం ఉదయం 11.40 గంటలకు లబ్ధిదారుల్లో ఒకరైన గొల్లపుడి నాగమణికి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. సంభాషణ ఇలా సాగింది..

హలో నాగమణా మాట్లాడేది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నం.
నాగమణి: అవునండీ నేను నాగమణినే..
అయితే మీతో ముఖ్యమంత్రిగారు మాట్లాడుతారంట.
నాగమణి: సరేనండీ..
సీఎం: అమ్మా నాగమణీ నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మాట్లాడుతున్నా.
నాగమణి: నమస్కారం సార్‌.
సీఎం: నువ్వు ఏం పనిచేస్తావ్‌.
నాగమణి: మేము చాకలివాళ్లం సార్‌. వూళ్లొ వాళ్ల దుస్తులు ఉతుకుతుంటా.
సీఎం: ఎంత వరకు చదువుకున్నావ్‌. నీకు పిల్లలు ఎంత మంది.
నాగమణి: నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు.
సీఎం: నీకు రెండు పడకగదుల ఇళ్లు మంజూరు అయిందా?
నాగమణి: మంజూరైంది సార్‌.
సీఎం: ఇళ్లు వచ్చినందుకు నువ్వుఎలా ఫీలవుతున్నావు
నాగమణి: ఇటువంటి ఇంట్లో ఉంటానని కలలో కూడా వూహించలేదు సార్‌. అమ్మానాన్నలు, తోడబుట్టిన వాళ్లు వదిలేసినా మనోధైర్యంతో బతుకుతున్నా. మీరు నన్ను ఆదుకున్నారు. నేను, నా పిల్లలు మీకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రుణపడి ఉంటాం.
సీఎం: మీ గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంది?
నాగమణి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న నాటి నుంచి అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. రహదారులు పూర్తయ్యాయి. పంచాయతీ కార్యాలయం, దోబీఘాట్‌ నిర్మించారు. అన్ని పనులు జరుగుతున్నాయి.
సీఎం: మీ గ్రామంలో జనాభా ఎంత మంది ఉంటారు.
నాగమణి: మా గ్రామంలో మొత్తం 1,450 మంది ఉంటారు సార్‌.
సీఎం: అందరూ కలిసికట్టుగా ఉండి మీ గ్రామాన్ని గంగదేవిపల్లి మాదిరిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటారా.
నాగమణి: ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం సార్‌.
సీఎం: మీ గ్రామంలో ఒంటరి మహిళలు ఎంత మంది ఉంటారు.
నాగమణి: ఆరుగురున్నారు సార్‌.
సీఎం: వారికి పింఛను ఇవ్వవచ్చా?
నాగమణి: వారికి పింఛను చాలా అవసరం సార్‌. ఆర్థికంగా ఆసరా కల్పించిన వారవుతారు. మహిళలు, వాళ్ల పిల్లలు బతికున్నంతకాలం మీకు రుణపడి ఉంటారు సార్‌.
సీఎం: మరి మీ గ్రామం వరకే ఇస్తే సరిపోతుందా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలా..?
నాగమణి: రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలందరికీ పింఛన్లు ఇవ్వాలి సార్‌.

చివర్లో.. ‘‘అమ్మ..కబురు చేస్తా.. హైదరాబాద్ వచ్చి ఓసారినన్ను కలువు అంటూ తన సంభాషణ ముగించారు. ఈ తరహా మాటలు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

- Advertisement -